: కోడి కోసం జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
కోడి కోసం ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. ఆదోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం నిందితుడు బోయ నరసింహులుకు జీవిత ఖైదుతో పాటు రూ.100 జరిమానా కూడా విధించింది. ఈ కేసు పూర్వాపరాలు.. 2013లో కర్నూలు జిల్లా ఆదోనిలోని టీజీఎల్ కాలనీలో కోడి విషయమై సాధిక్, బోయ నరసింహుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నరసింహులు బండరాయి తీసుకుని సాధిక్ ను కొట్టి చంపాడు.