: రూ.30కే పెట్రోల్ అందనుంది: అమెరికన్ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా


వాహనదారులకు అమెరికన్ ఫ్యూచరిస్ట్‌ టోనీ సెబా తీపికబురు చెప్పారు. ఆయన సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకుడు, స్టాన్‌ఫర్డ్ కాంటినెనింగ్ స్టడీస్ ప్రోగ్రాంలో బోధకుడుగా ఉన్నారు. రాబోయే ఐదేళ్లలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.30ల క‌న్నా త‌క్కువ రేటుకే ల‌భించ‌నుందని ఆయన తెలిపారు. సోలార్‌ పవర్‌ కు భారీగా డిమాండ్ పెర‌గ‌డం, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లతో చమురు డిమాండ్‌ గణనీయంగా పతనం కానుండ‌డంతో చ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గిపోతాయ‌ని సెబా అంచ‌నా వేశారు. ప్ర‌ధానంగా చమురు బ్యారెల్‌ ధర త్వరలోనే 25 డాలర్లకు త‌గ్గ‌నుంద‌ని తెలిపారు.

ఇది ఇలాగే కొన‌సాగి 2020 నాటికి చమురు గిరాకీ 100 మిలియన్ బారెల్స్‌కు త‌గ్గుతుంద‌ని తెలిపారు. అలాగే పది సంవత్సరాలలో 70 మిలియన్ బారెల్స్ పడిపోతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం భారీగా అధిక‌మై, ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయ‌ని తెలిపారు. అలాగే, ఈ వాహనాల ధరలు కూడా చ‌వ‌క‌గా ఉంటాయ‌ని అంచ‌నా వేశారు. అంతేగాక‌, 2030నాటికి 95శాతం  ప్రజలు  ప్రైవేటు వాహనాలకు స్వస్తి చెబుతారని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీంతో ఆటో మొబైల్ రంగం క‌నిపించ‌కుండా పోతుంద‌ని చెప్పారు. సెబా వేసిన ఈ అంచనాల నేప‌థ్యంలో ఇటీవ‌ల‌ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చేసిన‌ వ్యాఖ్యలు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. 2030 నాటికి మ‌న‌దేశంలో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయని ఆయ‌న ప్రకటన చేసిన విష‌యం తెలిసిందే. అంతేగాక‌, రానున్న‌ 15 సంవత్సరాల తర్వాత దేశంలో ఒక్క పెట్రోల్ లేదా డీజిల్ కారు అమ్మకాలు కూడా ఉండబోవని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News