: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావాలి.. బీసీసీఐ ప్రకటన!
టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ గా వ్యవహరించాలనుకుంటున్న ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామంటూ ప్రకటన ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో... హెడ్ కోచ్ కోసం ప్రకటన జారీ చేసినట్టు తెలిపింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య సలహాదారు కమిటీ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందని చెప్పింది. నిబంధనల ప్రస్తుతం హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే మాత్రం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. ఆయనకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. హెడ్ కోచ్ పదవి చేపట్టాలనుకుంటున్న వారు coachappointment@bcci.tv కి ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు పంపాలి.