: బంపర్ ఆఫర్లు ప్రకటించిన వొడాఫోన్‌


టెలికం మార్కెట్లో రిల‌య‌న్స్ ఇచ్చిన పోటీతో మిగ‌తా కంపెనీలు కూడా ఆఫ‌ర్ల జోరును పెంచిన విష‌యం తెలిసిందే. తాజాగా వొడాఫోన్ మ‌రో మూడు ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. సూపర్‌ డే, సూపర్‌ వీక్‌, సూపర్‌ అంబరిల్లాల పేరిట అతి త‌క్కువ ధ‌ర‌కే ఫ్రీ కాల్స్‌, డేటా స‌దుపాయాల‌ను అందిస్తోంది.  

ఈ ఆఫ‌ర్ల ప్ర‌కారం అందిస్తున్న ప్ర‌యోజ‌నాలు...


సూపర్‌ డే ప్లాన్‌: రూ.19 ల రీచార్జ్‌తో ఒక్క‌రోజు వ్యాలిడిటీతో ఉచిత కాలింగ్‌, 100 ఎంబీ 4జీ డేటా

సూపర్‌ వీక్ ప్లాన్‌: రూ.49 రీఛార్జ్‌తో  ఏడురోజుల వ్యాలిడిటీతో  250ఎంబీ 4జీ డేటా ప్ల‌స్‌ వొడాఫోన్ టు వొడాఫోన్‌ ఉచిత కాలింగ్‌

అంబరిల్లా ప్లాన్‌: రూ. 89 రీచార్జ్‌తో వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్‌, 100 ని.ల ఇతర నెట్‌వర్క్‌లకు కాలింగ్ ప్ల‌స్‌ 250 ఎంబీ 4జీ డేటా

  • Loading...

More Telugu News