: ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి... పరామర్శించిన తెలంగాణ సీఎం కేసీఆర్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న చాపర్ లాతూర్ ప్రాంతంలో క్రాష్‌ల్యాండ్ అవ్వగా ఈ ప్రమాదం నుంచి సీఎంతో పాటు ఆయన బృందం క్షేమంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. కొద్ది సేపటి క్రితం ఫడ్నవీస్‌కు ఫోన్ చేసిన కేసీఆర్ ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు ఫడ్నవీస్ జరిగిన ఘటనను గురించి వివరించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడం పట్ల కేసీఆర్ వారిని అభినందించారు.