: కారు విండోస్ కి బ్లాక్ ఫిల్మ్... టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్యకు జరిమానా విధించిన పోలీసులు!


ఈ ఉదయం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్యకు రూ. 500 జరిమానా విధించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తన కారులో వస్తున్న ఆయన్ను పోలీసులు ఆపారు. కారుకు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో ఈ జరిమానా విధించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే బ్లాక్ ఫిల్మ్ ను తొలగించామని ఓ అధికారి తెలిపారు. కాగా, తనకు ఈ నిబంధన గురించి తెలియదని, తెలిసుంటే ముందుగానే తీసేసే వాడినని ఈ సందర్భంగా యాదయ్య వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News