: అమిత్ షాకు షడ్రుచుల విందును ఏర్పాటు చేసిన చంద్రబాబు


ఈ ఉదయం విజయవాడకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయడు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. అమిత్ షాతో పాటు ఒకే విమానంలో విజయవాడకు చేరుకున్న చంద్రబాబు, ఆపై నేరుగా కలెక్టర్ల సదస్సుకు వెళ్లిపోయారు. సదస్సును ముగించుకుని చంద్రబాబు, తన నివాసానికి బయలుదేరగా, బాబు ఆహ్వానం మేరకు అమిత్ తో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సుజనా చౌదరిలతో పాటు పలువురు మంత్రులు, బీజేపీ నేతలు కూడా విందుకు హాజరు కానున్నారు. వీరి కోసం చంద్రబాబునాయుడు పలు ప్రత్యేక వంటకాలతో కూడిన మెనూను సిద్ధం చేయించారని తెలుస్తోంది. వెజ్, నాన్ వెజ్ వెరైటీలు, ఆంధ్రా స్పెషల్ స్వీట్స్ అతిథులకు వడ్డించనున్నారు. ఈ విందు తరువాత అమిత్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యే అమిత్, చంద్రబాబులు పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News