: ఏపీలో సరికొత్త విధానం... ఎయిర్ పోర్టుల్లో తెలుగులో అనౌన్స్ మెంట్


ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై తెలుగులో అనౌన్స్ మెంట్లు వినపడబోతున్నాయి. విమానాల రాకపోకలపై తెలుగులో అనౌన్స్ మెంట్ ఉండేలా చూడాలని కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ విన్నవించారు. దీనికి అశోక్ గజపతిరాజు అంగీకారం తెలిపారు. దీంతో, తెలుగులో అనౌన్స్ మెంట్లు వినపడనున్నాయి. మరోవైపు ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో స్థానిక భాషల్లో అనౌన్స్ మెంట్లు వినపడుతున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా విమానాశ్రయాల సంఖ్య పెరగడంతో... ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర మంత్రి కూడా దీనికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇకపై ఏపీ ఎయిర్ పోర్టుల్లో తెలుగు వినపడనుంది. 

  • Loading...

More Telugu News