: 'ట్రంప్' అనే కుక్కను కిడ్నాప్ చేశారు.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన యజమాని!


అతనికి ట్రంప్ అంటే ఇష్టమో.. లేక ద్వేషమో తెలియదు కానీ, తన కుక్కకి ట్రంప్ అన్న ముద్దు పేరు పెట్టుకున్నాడు. రోజూ తనతోపాటు వాకింగ్ కు తీసుకువెళుతుంటాడు. అయితే, నిన్న తన ట్రంప్ ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఢిల్లీ లో చోటుచేసుకుంది.  

ఉత్తరఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండే మహేంద్రనాథ్ అనే వ్యక్తి పగ్ (హచ్ కుక్క) జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు 'ట్రంప్'. నేటి ఉదయం 6:30 గంటలకు ట్రంప్ ను వాకింగ్‌ కు తీసుకెళ్లాలని ఆ ప్రాంతానికి చెందిన సెక్యూరిటీ గార్డును కోరారు. దీంతో ఆయన ట్రంప్ ను తీసుకుని వాకింగ్ కు వెళ్లారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వచ్చి ట్రంప్ ను ఎత్తుకెళ్లిపోయారు.

వెంటనే సెక్యూరిటీ గార్డు వారి వెంట పడ్డా... వారు వాహనంలో పరారవడంతో పట్టుకోలేకపోయాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్రంప్ ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా, ట్రంప్ ఆచూకీ తెలిపిన వారికి 11,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని యజమాని ప్రకటించారు.

  • Loading...

More Telugu News