: రజనీ పార్టీలో మేము చేరుతున్నాం: మీనా, నమితల ప్రకటన
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పార్టీపై విస్పష్ట ప్రకటన చేయనున్నారని, ఇప్పటికే పార్టీ జెండా (గుర్తు) తయారైందని తమిళ మీడియా పేర్కొంటోంది. ఈ మేరకు రజనీకాంత్ ఒక సీనియర్ జర్నలిస్టును తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారని కూడా మీడియా కథనాలు చెబుతున్నాయి. రజనీ రాజకీయ ప్రవేశంపై కసరత్తు చేసిన టీమ్, పార్టీ సిద్ధాంతాల తయారీపై దృష్టి సారించిందని సమాచారం.
ఇక రజనీకాంత్ పార్టీ ప్రారంభించగానే వివిధ పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నాయకత్వం చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే అలాంటి వారిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే రాయబారాలు సాగినట్టు సమాచారం. కాగా, రజనీకాంత్ కొత్త పార్టీకి కోలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు మీనా, నమితలు మద్దతు తెలిపారు. ఇంకా పార్టీ ప్రకటించకముందే... తాము ఆయన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.