: సురేష్ ప్రభు అంబులెన్సులను ప్రారంభించిన చంద్రబాబు, అమిత్ షా
విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కలసి 13 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ అంబులెన్సులను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేశారు. సురేష్ ప్రభు ఏపీ నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం హైదరాబాదు నుంచి చంద్రబాబు, అమిత్ షా, వెంకయ్యనాయుడులు ఒకే విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు.