: పతనమవుతున్న డాలర్... బలపడుతున్న రూపాయి


మన రూపాయి క్రమంగా బలపడుతోంది. అమెరికన్ డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు కూడా బలపడింది. ఫెడ్ పాలసీ అంచనాలతో డాలర్ అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో... డాలర్ విలువ పతనమవుతోంది. వడ్డీ రేట్లను ఫెడ్ పెంచుతున్నట్టు సంకేతాలు వెలువడటం, సహాయక ప్యాకేజీలను ఉపసంహరించనున్నట్టు వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో, డాలర్ అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, రూపాయి బలపడుతోంది. నిన్నటి ట్రేడింగ్ లో 7 వారాల కనిష్ట స్థాయి నుంచి ఒక్క సారిగా రూపాయి విలువ హై జంప్ చేసింది. ఈ రోజు కూడా 25 పైసలు పెరిగి రూ. 64.48 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది.  

  • Loading...

More Telugu News