: దాడి వల్ల సర్వనాశనమయ్యానంటున్న కొణతాల
తెలుగుదేశానికి సెలవు చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు దాడి వీరభద్రరావు సిద్దమైపోవడంతో అదే పార్టీకి చెందిన కొణతాల రామకృష్ణ కొంచెం కటవుగానే స్పందించారు. పార్టీలో చేరేవాళ్లలో అవినీతిపరులు, స్వార్థపరులుంటారని అన్నారు. పార్టీలో చేర్చుకునేముందు అలాంటివి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకోవడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పకనే చెప్పారు. దాడివల్ల గతంతో తాను సర్వనాశనమైన మాట వాస్తవమేనని కొణతాల అన్నారు.