: ఈదురు గాలులు, వర్షంతో బెంగళూరు ఎయిర్ పోర్టు అతలాకుతలం... శంషాబాద్ కు క్యూ కట్టిన విమానాలు
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా బెంగళూరు ఎయిర్ పోర్టులో విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో పలు విమానాలు శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు దారి మళ్లాయి. వర్షంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో, దిగాల్సిన విమానాలకు ఏటీసీ అనుమతులు లభించలేదు. దీంతో ముంబై, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన విమానాలను హైదరాబాద్ లో దించారు. హైదరాబాద్ నుంచి కదలాల్సిన సర్వీసుకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల అనంతరం బెంగళూరులో వర్షం తెరిపిచ్చిందన్న సమాచారం రావడంతో విమానాల టేకాఫ్ కు శంషాబాద్ ఏటీసీ ఓకే చెప్పింది.