: పరేష్ రావల్ కు దిమ్మతిరిగే సెటైర్ వేసిన అరుంధతీ రాయ్!


ఆర్మీ జీపుకు జమ్ముకశ్మీర్ యువకుడిని కాకుండా అరుంధతీ రాయ్ ని కట్టాల్సిందంటూ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేష్ రావల్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పరేష్ రావల్ పలువురి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి కొందరు ఆయనను సపోర్ట్ కూడా చేశారు. ఈ క్రమంలో, పరేష్ కు అరుంధతీ రాయ్ దిమ్మతిరిగే రీతిలో సెటైర్ వేశారు. పరేష్ రావల్ ఎవరో తెలుసుకోవడానికి తాను గూగుల్ లో వెతుక్కోవాల్సి వచ్చిందంటూ దెప్పి పొడిచారు. ప్రస్తుతం తానొక గ్రహాంతరవాసిలా మారిపోయానంటూ తెలిపింది.

మరోవైపు కశ్మీర్ అల్లర్లపై తాను కామెంట్ చేసినట్టు వచ్చిన వార్తలను అరుంధతీ రాయ్ ఖండించారు. ఇదంతా అనవసరమైన రాద్ధాంతమని ఆమె అన్నారు. కశ్మీర్ అల్లర్లపై తాను ఎలాంటి కామెంట్ చేయలేదని చెప్పారు. ఈ మధ్య కాలంలో తాను శ్రీనగర్ కే వెళ్లలేదని తెలిపారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News