: ఏపీకి ఇంకో రూ. 138 కోట్లు మాత్రమే బకాయి: చంద్రబాబు లేఖకు జైట్లీ సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద కేంద్రం నుంచి రావాల్సిన మొత్తం కేవలం రూ.138.39 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖకు సమాధానం ఇస్తూ, రెవెన్యూ లోటు మొత్తాన్ని రూ. 16,078 కోట్ల నుంచి రూ. 4,117.89 కోట్లకు తగ్గించిన విషయాన్ని తెలిపారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ. 3,979.50 కోట్లు ఇచ్చేశామని గుర్తు చేశారు. బకాయి ఉన్న మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేంద్రం నుంచి తమకు రావాల్సిన బకాయిలు పెరిగిపోయాయని, ఈ విషయంలో వెంటనే స్పందించాలని ఇటీవల చంద్రబాబు మోదీ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.