: అమెరికాలో సరికొత్త వసూళ్ల రికార్డును నమోదు చేసిన బాహుబలి


'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా సరిహద్దులను చెరిపేసింది. రికార్డు వసూళ్లతో బాక్సాఫీసు రికార్డులన్నీ చుట్టేసిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' అమెరికాలో కూడా సత్తా చాటి 20 మిలియన్ డాలర్లు సాధించింది. ఈ నెల 21వ తేదీ నాటికి అమెరికా, కెనడాల్లో కలిపి 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' 20 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన భారతీయ సినిమా ఇంతవరకు లేదని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా తరువాతి స్థానంలో 'బాహుబలి: ద బిగెనింగ్' ఆ తరువాతి స్థానంలో 'శ్రీమంతుడు' సినిమాలున్నాయి.





  • Loading...

More Telugu News