: లాలు కుటుంబాన్ని వెంటాడుతున్న కష్టాలు.. మీసా భారతికి ఐటీ సమన్లు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని చుట్టుముట్టిన కష్టాలు ఇప్పట్లో కడతేరేలా కనిపించడం లేదు. తాజాగా లాలు కుమార్తె మీసా భారతికి ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. భూ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని ఆరోపిస్తూ ఈ సమన్లు పంపింది. భారతి చార్టెరెడ్ అకౌంటెంట్ (సీఏ) రాజేష్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన తర్వాతి రోజే ఆమెకు ఐటీ శాఖ సమన్లు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. రూ.8వేల కోట్ల భూ కుంభకోణంలో మీసా భారతి భర్త శైలేష్ కుమార్ హస్తం కూడా ఉందని భావిస్తున్న అధికారులు ఆయనకు కూడా సమన్లు జారీ చేశారు. ఇక సమన్లు అందుకున్న లాలు కుమార్తె జూన్ 6న ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాగా, ఇటీవల ఐటీ శాఖ ఢిల్లీలో లాలుప్రసాద్‌కు చెందిన 22 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News