: మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ... ఫేస్ బుక్ పుట్టిన గదిని చూపిన జుకెర్ బర్గ్...మీరు కూడా చూడండి!
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ కాలేజీ రోజుల మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రసంగించేందుకు హర్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు వెళ్లిన జుకెర్ బర్గ్ గతంలో యూనివర్సిటీతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. యూనివర్సిటీలోని ఒకప్పటి తన హాస్టల్ గదిని సందర్శించారు. ఈ సందర్భంగా ఫేస్ బుుక్ లైవ్ లో ఫేస్ బుుక్ పుట్టిన గదిని చూపించారు. ఆనాటి మధురమైన అనుభూతులను గుర్తు చేసుకుంటూ తన ఆనందాన్ని ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పంచుకున్నారు.
కాగా, ఇదే ప్రాంగణంలో జూకెర్ బర్గ్ కు అతని భార్య ప్రిసిల్లా చాన్ పరిచయమైంది. ఈ సందర్భంగా ఆమె కూడా ఆ గదిని సందర్శించారు. అయితే ఫేస్ బుక్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకుగాను ఆయన మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పారు. కాగా, 2004 ఫిబ్రవరి 4న ఫేస్ బుక్ ప్రస్థానం ప్రారంభమైంది.