: జనాభాలో చైనాను వెనక్కి నెట్టేసిన భారత్.. చైనా డెమోగ్రాఫర్ సంచలన వ్యాఖ్యలు


ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదా? ఆ స్థానం ఇప్పుడు భారత్‌దా? అవుననే అంటున్నారు చైనాకు చెందిన స్వతంత్ర జనశాస్త్రవేత్త ( డెమోగ్రాఫర్), విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యి ఫుక్సియాన్. చైనా జనాభాను భారత్ ఎప్పుడో దాటేసిందని ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది నాటికి చైనా జనాభా 129 కోట్లు అని జాతీయ గణాంకాలు చెబుతున్నాయని, అయితే వాస్తవానికి అంతకంటే 9 కోట్లు తక్కువేనని ఆయన వాదిస్తున్నారు. ఇక భారత అధికారిక గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభా 133 కోట్లు. ఈ లెక్కన చూస్తే చైనా కంటే భారత్‌లో జనాభా ఎక్కువని ఆయన వాదిస్తున్నారు. ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కే ఆ ఖ్యాతి లభిస్తుందని ఫుక్సియాన్ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News