: సీఎం కేసీఆర్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి: దత్తాత్రేయ హితవు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై సీఎం కేసీఆర్ లేనిపోని విమర్శలు చేశారని, తన స్థాయికి తగ్గట్టు ఆయన మాట్లాడాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హితవు పలికారు. లేనిపోని విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, బీజేపీ ఎవరి బెదిరింపులకు భయపడదని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలిపెడుతున్నామని అన్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు దేశాభివృద్ధే ద్యేయంగా తమ పార్టీ ముందుకు వెళ్తోందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దత్తాత్రేయ పేర్కొన్నారు.