: జకార్తాలో జంట పేలుళ్లు.. ముగ్గురి మృతి
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జంట బాంబు పేలుళ్ల ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈస్ట్ జకార్తా పోలీసు అధికారి ఆండ్రీ విబో ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, బస్టాప్ కు సమీపంలో జంట బాంబు పేలుళ్లు సంభవించాయని చెప్పారు. ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో కాంపుంగ్ మెలాయ్ టెర్మినల్ వద్ద జరిగిన ఈ పేలుళ్లకు కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.