: ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిసిన వైసీపీ నేతలు
ఏపీలో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు డీజీపీ సాంబశివరావును కలిశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి సహా పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని తమ వినతిపత్రంలో కోరారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని, పిన్నెల్లిపై కేసు పెట్టేందుకు మూడుసార్లు ఎఫ్ఐఆర్ ను మార్చారని, టీడీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి, మర్రి రాజశేఖర్ ఈ సందర్భంగా ఆరోపించారు.