: వెంకయ్య నాయుడు జోక్యంతో ‘నీట్’ కు కటాఫ్ మార్కుల తగ్గింపు


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జోక్యంతో దేశ వ్యాప్తంగా మెడికల్ పీజీ నీట్ కు కటాఫ్ మార్కులు తగ్గించారని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఓసీలకు 705 నుంచి 599 మార్కులకు, ఎస్సీ, ఎస్టీలకు 564 నుంచి 458 కు కటాఫ్ మార్కులు తగ్గించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జేపీ నడ్డా లకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉండటంతో పీజీ కోర్సులో సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్రానికి కామినేని తెలిపారు. దీంతో, నీట్ కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News