: అనంతపురంలో భారీ వర్షం.. నేలకొరిగిన చెట్లు
మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోయేలా భానుడు నిప్పులు చెరుగుతుంటే, సాయంత్రం మాత్రం అనంతపురంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ రోజు ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని కల్యాణ దుర్గంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో పలు చెట్లు, రేకుల షెడ్లు కూలిపోయాయి. ధర్మవరం మండలం పాతకుంటలో పిడుగుపాటుతో ఓ కొబ్బరిచెట్టు కూలింది.