: అమిత్ షా పర్యటన ఓ ఫ్లాప్ షో: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఓ ఫ్లాప్ షో అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఈ రోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమిత్ షా పర్యటనకు సామాన్య ప్రజల నుంచి స్పందన కరువైందని అన్నారు. స్థానిక బీజేపీ నాయకులు నిర్ణయించిన ప్రకారం ముందుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకే ఆయన పర్యటన పరిమితమైందని అన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు.