: బాహుబలి సినిమాలోని పాత్రలతో ఫేస్ బుక్ లో ఎమోజీలు.. అదుర్స్!


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 సినిమా భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోని అన్ని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి ఇప్ప‌టికే 1500 కోట్ల రూపాయల క‌లెక్ష‌న్ల‌ను దాటేసి దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో న‌టించిన ఆర్టిస్టులకు ఎంతో పేరువ‌చ్చింది. ఈ క్రమంలో ఇప్పుడీ బాహుబలి పాత్ర‌తోనే సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ లో ఎమోజీలు వ‌చ్చేశాయి. గ‌తంలో ఎప్పుడో వ‌చ్చిన‌ షోలే చిత్రం ఎమోజీల‌ను మాత్ర‌మే ఫేస్‌బుక్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం చూశాం. ఇప్పుడు బాహుబ‌లిలోని ప్ర‌భాస్‌, రానా, నాజ‌ర్, ర‌మ్య‌కృష్ణ లాంటి వారంద‌రి పాత్రల ఎమోజీలు  ఫేస్ బుక్ సైట్ లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

  • Loading...

More Telugu News