: పోలీసధికారి భార్య హత్య కేసులో కొత్త కోణం: కన్నకొడుకే హంతకుడు!


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన‌ షీనా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల్లో ఒకరైన ముంబై పోలీసు అధికారి జ్ఞానేశ్వర్ గనోరె భార్య దీపాలి గనోరె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. నిన్న రాత్రి ముంబైలోని శాంతాక్రజ్ లో ఈ హ‌త్య‌ జరిగింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమె కన్న కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. ఆమె కుమారుడు సిద్ధాంత్ గత రాత్రి నుంచి ఇంట్లో లేకుండా పోవ‌డంతో అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు.

అత‌డు త‌న త‌ల్లి పీక కోసి చంపేశాడ‌ని, ఆమె రక్తంతో ఇంట్లో నేలమీద 'ఆమె అంటే విసుగెత్తిపోయింది. నన్ను పట్టుకుని ఉరితీయండి' అని రాశాడని తెలిపారు. ప్ర‌స్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించామ‌ని, ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌ని చెప్పారు. నిందితుడు సిద్ధాంత్ నేషనల్ కాలేజిలో త‌న‌ ఇంజనీరింగ్ చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపేశాడు. కొన్ని నెలలుగా ఎవ‌రితోనూ మాట్లాడ‌కుండా ఉంటున్నాడు. ఆ తల్లీకొడుకుల మధ్య ఏ గొడవ జ‌రిగిందో ఇంకా తెలియ‌రాలేదు.              

  • Loading...

More Telugu News