: తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది టీడీపీయే: సీఎం చంద్రబాబు


తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది టీడీపీయేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న తెలంగాణ మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతి టీడీపీ కార్యకర్త కొదమసింహంలా దూసుకెళ్తున్నారని, ఈ రాష్ట్రంలో టీడీపీ జెండా రెపరెపలాడే వరకూ పోరాడతామని అన్నారు. ఎన్టీఆర్ పెట్టిన ముహూర్త బలం వల్ల మనం ఎవ్వరికీ భయపడటం లేదని, కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని అన్నారు. టీడీపీ వచ్చాకే తెలంగాణలో అనేక మార్పులు వచ్చాయని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News