: ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని: హీరో ప్రభాస్


‘బాహుబలి’ చిత్రం కోసం అవసరమైతే ఏడేళ్లు పనిచేయడానికైనా తాను సిద్ధపడ్డానని, అలాంటి పాత్రల్లో నటించే అవకాశం ఏ నటుడికైనా జీవితంలో ఒక్కసారే వస్తుందని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని హీరో ప్రభాస్ చెప్పాడు. దర్శకుడు రాజమౌళిపై తనకు గట్టి నమ్మకం, గౌరవం వున్నాయని, ‘బాహుబలి’గా తాను నటించగలనని ఆయన నమ్మినందుకు ప్రభాస్ సంతోషం వుందని చెప్పాడు. ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధిస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని, ఈ చిత్రం విజయంతో ప్రాంతీయ చిత్ర నిర్మాతల ఆశలను పెంచిందని అన్నాడు. అసలు, నటనారంగంలోకి రావాలని తాను ఎప్పుడూ అనుకోలేదని, ఎందుకంటే, తనకు మొహమాటం ఎక్కువని చెప్పాడు. అయితే, తనకు పద్దెనిమిదేళ్ల వయసులో తాను నటుడిని కావాలనే ఆలోచన రావడంతో, ఈ విషయాన్ని తన తండ్రి, పెదనాన్నకు చెప్పడంతో వాళ్లు ప్రోత్సహించారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News