: భిన్నమైన పాత్రల్లో నటించాలనుకుంటా: మనీషా కొయిరాలా
భిన్నమైన పాత్రల్లో నటించడమంటే తనకు ఇష్టమని బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా అన్నారు. అనారోగ్య కారణాలతో చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న మనీషా ‘డియర్ మాయ’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఓ వృద్ధురాలి పాత్రలో ఆమె కనపడనుంది. ఈ సందర్భంగా మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అందంగా కనిపించడం కన్నా, భిన్నమైన పాత్రల్లో నటించాలని తాను కోరుకుంటానని, అలాంటి పాత్రల్లో నటించకపోతే తాను నటిగా ఎలా ఎదగగలనని ప్రశ్నించింది. గతంలో తాను కొన్ని నెగెటివ్ పాత్రలు పోషించానని, నటిగా ఏ పాత్రనైనా పోషించాల్సిందేనని అన్నారు.