: పార్టీ నాయకులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి: దేవినేని ఉమ
టీడీపీ నాయకులందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతే నాయకులుగా ఉండి ఏం లాభమని మండిపడ్డారు. పదవిలోకి రాగానే గొప్పవాడిని అయిపోయాననే అహంకారం వస్తోందని, ఆ ఆలోచన నుంచి బయటపడాలని సూచించారు. రాష్ట్రంలో మరో యాభై ఏళ్లు టీడీపీ అధికారంలో ఉండాలని దేవినేని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ రాజకీయాలు, వైఎస్సార్సీపీ నేతల గురించి ఆయన ప్రస్తావించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యతో తమకు సంబంధం లేదని అన్నారు.