: మళ్లీ పెరిగిన బంగారం ధర!
పుత్తడి ధర మళ్లీ పెరిగింది. ఈ రోజు మళ్లీ రూ. 29 వేల మార్క్ ను దాటింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 185 పెరిగి రూ. 29,100కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,251.60 డాలర్లుగా ఉంది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 39,600కి చేరుకుంది.