: భారతీయులు తరతరాల పాటు గుర్తుంచుకునేలా దెబ్బ తీస్తాం!: పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరాకు సమీపంలో ఉన్న శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో తమ సైనికులు కూడా భారత్ కు బదులు ఇవ్వాలని భావిస్తున్నట్లు, యుద్ధ విమానాలతో సియాచిన్ ప్రాంతంలో చక్కర్లు కొట్టారని పాకిస్థాన్ పత్రికలు పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే పాక్ వైమానిక దళానికి చెందిన అన్ని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను కార్యకలాపాలకు సిద్ధంగా ఉంచినట్లు తమ దేశ ఎయిర్ చీఫ్ మార్షల్ సొహైల్ ధ్రువీకరించారని పాక్ మీడియా పేర్కొంది. భారతదేశం ఒకవేళ దాడి చేస్తే భారతీయులు తరతరాల పాటు గుర్తుంచుకునేలా తాము దెబ్బతీస్తామని సొహైల్ చెప్పినట్లు జియో టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. ఈ విషయంపైనే సోహైల్ పైలట్లు, టెక్నికల్ స్టాఫ్‌తో మాట్లాడారని, ఆయన స్వయంగా మిరేజ్ జెట్‌ను కూడా నడిపారని తెలిపింది.