: నాకు సీఎం అధిష్ఠానం..అడిగితే వివరణ ఇస్తా: ఎంపీ కేశినేని నాని
టీడీపీ-బీజేపీ పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాకు సీఎం అధిష్ఠానం..అడిగితే వివరణ ఇస్తా. తల పగిలినా కొండను ఢీకొట్టేందుకు సిద్ధం, అదీ నా కాన్ఫిడెన్స్. కార్యకర్తల్లో ప్రేరణ కోసమే అలా మాట్లాడాను. పార్టీ సమావేశంలోనే మాట్లాడాను. బహిరంగ సభలో కాదు. పొత్తులు, నామినేటెడ్ పోస్టుల అంశం అధిష్ఠానం చూసుకుంటుంది’ అని అన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలకు నాని పిలుపు నిచ్చారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భగా రాష్ట్ర పునర్విభజన జరిగిన తీరు బాధాకరమని, కేంద్రం నుంచి ఇంకా నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు.