: మహానాడుకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య


టీటీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న మినీ మహానాడుకు ఆయన డుమ్మా కొట్టారు. చాలా కాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు అంటీ ముట్టనట్టే ఉన్నారు. కృష్ణయ్య పార్టీ మారుతున్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. నిన్నకాక మొన్న బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి కూడా ఆయనను కలిశారు. బీజేపీలో చేరాలని ఆయనను పురంధేశ్వరి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తన కుమారుడి వివాహానికి ఆమె రాలేకపోయారని... అందుకే నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు తమ ఇంటికి వచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ఈ రోజు జరుగుతున్న మహానాడుకు గైర్హాజరు కావడంతో... పార్టీ మారతారనే అనుమానాలకు మరింత బలం వచ్చినట్టైంది.

  • Loading...

More Telugu News