: రెండు పార్టీల బంధంపై అమిత్ షా, చంద్రబాబు స్పష్టతతో ఉన్నారు: మంత్రి కామినేని


టీడీపీ, బీజేపీల బంధంపై అమిత్ షా, చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 వరకు టీడీపీ-బీజేపీ పొత్తు కొనసాగుతుందని, కింది స్థాయిలో స్థానిక సమస్యలతో పొత్తుపై తలోమాట మాట్లాడుతున్నారని అన్నారు. 13,202 డీఎంఈ ఆసుపత్రుల్లో సప్తవర్ణ బెడ్ షీట్స్ కార్యక్రమం విషయంలోనూ, వైద్య శాఖలో సాంకేతిక సహాయంపైనా బిల్ గేట్స్ మెలిండా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అన్నారు. టెలీ సోనాలజీ టెండర్స్ రద్దు చేశామని, వైద్య ఆరోగ్య శాఖలో పారదర్శకంగా బదిలీలు నిర్వహిస్తామని, సాఫ్ట్ వేర్ అప్ డేట్ సమస్యలతో బదిలీల గడువు పెంచమని సీఎంను కోరానని కామినేని చెప్పారు.

  • Loading...

More Telugu News