: అమ్మాయిలూ! కత్తులు వెంటపెట్టుకుని వెళ్లండి: నన్నపనేని
ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు అమ్మాయిలు కత్తులు వెంటపెట్టుకుని వెళ్లాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. కేరళలో ఓ అమ్మాయి తనపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ బాబా జననాంగాన్ని కోసేసిందని, ఆ రాష్ట్ర సీఎం ఆమెపై కేసు లేకుండా చేశారని గుర్తు చేశారు. తమ వెంటపడి అకృత్యాలకు పాల్పడే వారి పట్ల అమ్మాయిలు ఆ కేరళ యువతిలాగే ప్రవర్తించాలని అన్నారు. ఈ రోజు విశాఖ ఏజెన్సీలో గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన నన్నపనేని అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియాలో అబ్బాయిలతో పరిచయాలు పెంచుకొని మోసపోవద్దని అన్నారు. తమ వెంట పడే వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించి, ఎదురుతిరగాలని సూచించారు.