: మరుగుతున్న సాంబారు ఒంటిపై పడి బాలుడి మృతి
కట్టెల పొయ్యి మీద మరుగుతున్న సాంబారు పాత్రను తాకడంతో అది మీదపడిపోయి ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సూరారంలో చోటు చేసుకుంది. సూరారంలో నివసించే పిట్ల స్వప్న, సురేష్‌ల కుమారుడు అరవింద్, ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కట్టెల పొయ్యి వైపుగా వెళ్లాడు. పొయ్యి మీద మరుగుతున్న సాంబారు పాత్రను ఆ చిన్నారి తాకడంతో అది అంతా అతడిపై పడిపోయింది. దీంతో తీవ్రగాయాలతో ఏడుపులంకించుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ బాలుడి తల్లిదండ్రులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందాడు.