: అమ్మానాన్న చనిపోతే మంత్రిని అయ్యా.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు!: భూమా అఖిలప్రియ
అమ్మ శోభ, నాన్న నాగిరెడ్డి చనిపోతే తాను మంత్రిని అయ్యానని... ఇలాంటి దారుణమైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో జరిగిన మినీ మహానాడులో ఆమె ప్రసంగిస్తూ ఈ విధంగా స్పందించారు. గత మహానాడులో నాన్న తన చేయి పట్టుకుని నడిపించారని... ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీలో చేరినందుకు తాను చాలా గర్వపడుతున్నానని... పార్టీ మారినందుకే ఆళ్లగడ్డ, నంద్యాలలో అభివృద్ధి పనులు సాధ్యమవుతున్నాయని చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి జయంతులను అధికారికంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు.