: అమెరికాలో నోకియా, ఎరిక్సన్ కంపెనీల ప్రతినిధులతో చర్చించిన కేటీఆర్
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. పలువురు ప్రముఖులతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉన్నారు. ఈ రోజు ఆయన సిలికాన్ వ్యాలీలోని సాంటాక్లారాలో ఎరిక్సన్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తరువాత నోకియా కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడి, తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో ఆయా కంపెనీలు భాగస్వాములు కావాలని కోరారు. డేటా అనలటిక్స్ పార్కులో నోకియా మొబైల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. దీనిపై నోకియా ప్రతినిధులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.