: మారిన పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళలు
సికింద్రాబాద్ - భువనేశ్వర్ నగరాల మధ్య తిరిగే 'విశాఖ ఎక్స్ ప్రెస్' సహా పలు రైళ్ల ప్రయాణ వేళలను సవరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయనగరం - నెల్లిమర్ల మార్గంలో వంతెన పనులు జరుగుతున్నందున రైలు వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. సాయంత్రం 4:50 గంటలకు బయలుదేరాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు, వంతెన పనులు ముగిసిన తర్వాత రాత్రి 8:30కి బయలుదేరుతుందని, విశాఖకు ఉదయం 10:55 గంటలకు చేరుతుందని వెల్లడించింది. హౌరా - యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రాత్రి 8:35కు బదులుగా రాత్రి 11:50 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రాత్రి 5:30 గంటలకు బదులుగా రాత్రి 7:15 గంటలకు బయలుదేరుతుందని, హౌరా - చెన్నై సెంట్రల్ మెయిల్ ఎక్స్ ప్రెస్, శాలిమార్ - నాగర్ కోయిల్ 'గురుదేవ్ ఎక్స్ ప్రెస్' గంట ఆలస్యంగా నడుస్తాయని, చెన్నై సెంట్రల్ - సత్రాంగచ్చి ప్రత్యేక రైలు 4 గంటలు ఆలస్యంగా నడుస్తుందని, పాండిచ్చేరి - హౌరా వీక్లీ ఎక్స్ ప్రెస్ 3 గంటలు ఆలస్యమవుతుందని తెలిపింది. మారిన వేళలను ప్రయాణికులు గమనించాలని కోరింది.