: మూడు రోజుల్లో 40 శాతం పతనం... పాతాళానికి వీడియోకాన్ షేర్!


దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 520 కోట్ల రుణాన్ని వీడియోకాన్ తిరిగి చెల్లించడంలో విఫలమైందని, దీంతో ఆ మొత్తాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తున్నామని బ్యాంకు చెప్పడంతో విడియోకాన్ వాటా విలువ పాతాళానికి కూరుకుపోయింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మూడు సెషన్ల వ్యవధిలో 42 శాతం పడిపోయింది. వరుసగా మూడో సెషన్ లోనూ సంస్థ వాటా విలువ లోయర్ సర్క్యూట్ ను తాకి 10 శాతం నష్టాన్ని నమోదు చేయగా, ట్రేడింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం గత వారం చివర్లో రూ. 100 వద్ద ఉన్న వీడియోకాన్ షేర్ విలువ ఇప్పుడు రూ. 58కి పడిపోయింది. బుధవారం నాటి సెషన్ ప్రారంభం కాగానే, 75,982 షేర్లను ఇన్వెస్టర్లు అమ్మకానికి పెట్టగా, వాటిని కొనుగోలు చేసే వారు లేక అమాంతం విలువ పడిపోయిందని ట్రేడ్ అనలిస్టులు వ్యాఖ్యానించారు. కాగా, డిసెంబర్ తో ముగిసిన సంవత్సరంలో సంస్థ రూ. 56 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. గృహోపకరణాల రంగంలో ఓకప్పుడు రాజ్యమేలిన వీడియోకాన్, ఇప్పుడు మిగతా సంస్థలతో పోటీ పడలేక, మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News