: హైదరాబాద్‌లో వంతెనకు ఉరివేసుకొని ఆత్మహత్య?
హైదరాబాద్‌లోని అప్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభించడం కలకలం రేపుతోంది. అక్కడి శివాజీ వంతెన వద్ద ఓ వ్యక్తి ఉరివేసుకుని చనిపోయాడు. అయితే, ఆ వ్యక్తి తనకు తానుగా ఉరేసుకున్నాడా? లేక ఎవరైనా అతడిని చంపేసి ఇలా ఉరివేసుకున్నట్లు చిత్రీకరించాలని చూశారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు ఉదయం స్థానికులకు ఆ మృతదేహం వంతెనకు వేలాడుతూ కనిపించిందని, వారు వెంటనే తమకు సమాచారం అందించారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.