: రైల్వే కార్యాలయాల్లో మంత్రి తనిఖీలు
హైదరాబాద్ లోని వివిధ కార్యాలయాలలో రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్య ప్రకాశ్ రెడ్డి తనిఖీలు చేయడం ఇదే మొదటి సారి. సికింద్రాబాద్ లోని రైల్వే ప్రధాన ఆస్పత్రి, బోయగూడలోని వాషింగ్ కేంద్రం, క్యాటరింగ్ కేంద్రాలలో కలియతిరిగి, రికార్డులను పరిశీలించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో సమావేశమయ్యారు.