: ఇంటర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ విద్యార్థిని విన్నపాన్ని క్షణంలో నెరవేర్చిన చంద్రబాబు


ఈ ఉదయం వెలగపూడిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు అభినందన సభ జరుగగా, ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నుంచి సీఈసీలో 965 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండో ర్యాంకు తెచ్చుకున్న బాలిక వేదికపై మాట్లాడుతూ, తన కుటుంబ పరిస్థితిని ఏకరవు పెట్టింది. తాము చాలా పేదవారమని, తన తండ్రి కొబ్బరిబొండాలు విక్రయించి, చాలా కష్టపడుతూ తనను చదివించారని చెప్పింది. తనకు ఐఏఎస్ చదవాలన్న కోరిక ఉందని, ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీకి వెళితే, వారు ట్రస్ట్ భవన్ నుంచి లెటర్ తెస్తే, ఉచిత విద్యను అందిస్తామని చెప్పారని, తనకు లెటర్ ఇప్పించాలని కన్నీళ్లతో వేడుకుంది. ఆ విద్యార్థిని స్థితికి చలించిపోయిన చంద్రబాబు, వెంటనే లెటర్ ఇప్పించే ఏర్పాటు చేశారు. బాలికను ట్రస్ట్ భవన్ కు వెళ్లాలని సూచించి, బాగా చదువుకోవాలని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకు చదువును చెప్పించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సైతం డబ్బు సంపాదనకన్నా, సమాజానికి సేవ చేయాలన్న గుణం పెరుగుతోందని, ఇది తనకు సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News