: ట్రంప్ కు పదేపదే షాకులిస్తున్న మెలానియా... వీడియో చూడండి!


ఒకసారి జరిగితే అనుకోకుండా జరిగిందని అనుకోవచ్చు. అదే ఘటన పునరావృతమైతే మాత్రం ఆలోచించాల్సిందే. తాజా ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పకనే చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ట్రంప్, రెడ్ కార్పెట్ పై మెలానియా చెయ్యందుకోవడానికి ప్రయత్నించగా, ఆమె తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయి లక్షలాది కామెంట్లతో చక్కర్లు కొడుతుండగానే, అటువంటిదే మరోసారి జరిగింది. రోమ్ లో ఆయన ల్యాండ్ అయిన వేళ, విమానం గేటు నుంచి బయటకు వచ్చి, మెలానియా చెయ్యిని అందుకోవడానికి స్వయంగా ప్రయత్నించగా, ఆమె ఆ చెయ్యి అందుకోకుండా వెంటనే తన జుట్టును సవరించుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను పలువురు తమ సోషల్ మీడియాలో పంచుకుంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.

  • Loading...

More Telugu News