: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. వ్యాపిస్తున్న అగ్ని కీలలు... ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాదులోని కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లిలోని ప్రకాశ్ నగర్ లోని తుక్కుగోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. వాటిని గుర్తించి స్పందించేలోపు అగ్ని కీలలు వ్యాపించాయి. దీంతో దగ్గర్లోని మరో నాలుగు తుక్కు గోదాములకు వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగసిపడుతున్నాయి. మంటల తీవ్రతకు స్థానికులు భయపడుతున్నారు. దీనిపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపకదళాలు సంఘటనాస్థలికి చేరుకుని, మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.