: చుట్టూ పాము ప్రతిమ, కళ్లుగా మరకత మణులు... ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్ ఇది!
లగ్జరీ ఫోన్లను తయారు చేసి మల్టీ బిలియనీర్లకు విక్రయించే వర్చ్యూ సంస్థ తాజాగా ‘వర్చ్యూ సిగ్నేచర్ కోబ్రా’ పేరిట మరో ఫోన్ ను తయారు చేసింది. ఫోన్ అంచుల చుట్టూ పాము ప్రతిమ, పాము కళ్లుగా ఖరీదైన మరకత మణులు, 439 కెంపులతో పొదిగి తయారు చేసిన బాడీతో ఉన్న ఈ ఫోన్ ధర 3.60 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.3 కోట్లు). ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ ఇదేనని ఆ సంస్థ చెబుతూ, మొత్తం 8 యూనిట్లను తయారు చేశామని, కావాల్సిన వాళ్లు 'జేడీ.కామ్'లో కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. ఇక ఫోన్ లో రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ తదితర సదుపాయాలుంటాయని వెల్లడించింది.