: హైదరాబాద్ మినీ మహానాడులో వడ్డిస్తున్న నోరూరించే వంటకాలివి!


తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమావేశాలు పెట్టినా నోరూరించేలా వంటకాలు సిద్ధమవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మినీ మహానాడు జరుగుతుండగా, ఇక్కడ కూడా పలు రకాల వంటకాలను ఆహూతుల కోసం సిద్ధం చేశారు. పది నుంచి పదిహేను వేల మందికి సరిపడా శాకాహార, మాంసాహార వంటకాలు సిద్ధం కాగా, చికెన్ కర్రీ, ఎగ్, చికెన్ బిరియానీ, వంకాయ మసాలా, పాలకూర పప్పు, సాంబారు, రసం, గడ్డ పెరుగు, మిరపకాయ బజ్జీలు, జిలేబీ, డబుల్ కా మీఠా, బగారా రైస్, వైట్ రైస్, ఫ్రూట్ సలాడ్, అప్పడాలు తదితర 15 రకాల ఐటమ్స్ సిద్ధం చేశామని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 200 మంది ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని వెల్లడించారు. సభ జరుగుతున్నంత సేపూ మంచి నీళ్ల బాటిల్స్, బిస్కెట్స్, మజ్జిగ అందిస్తున్నట్టు వెల్లడించారు. కాగా, మహానాడులో మాంసాహార వంటకాలను వడ్డించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News